పాలిటెక్నిక్ కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్!
హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి శాఖ (కార్మిక శాఖ) పరిధిలోకి మారుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో విడుదల చేసిన జీవో నంబర్ 97ను సవరిస్తూ ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్ 157ను విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు యథావిధిగా విద్యాశాఖ పరిధిలోనే కొనసాగనున్నాయి. దీంతో పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ, పరిపాలన, విద్యా సంబంధిత వ్యవహారాలు గతంలో మాదిరిగానే విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. కళాశాలలను మరో శాఖ పరిధిలోకి మారుస్తారన్న గత నిర్ణయంపై నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో స్పష్టత ఇచ్చింది.
ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవోలో ఐటీఐ (ITI), ఏటీఐ (ATI) విద్యాసంస్థలను మాత్రమే శక్తి శాఖ పరిధిలోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. పాలిటెక్నిక్ కళాశాలలను మాత్రం ఈ మార్పు నుంచి మినహాయించి విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిలో నెలకొన్న సందిగ్ధత తొలగనుంది. పాలిటెక్నిక్ విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఈ స్పష్టత ప్రాధాన్యత సంతరించుకుంది.