🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:26 pm Posted by : A Bharat Goud

పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన గ్రంథాలయం ప్రారంభం

News Image
పాలెం, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వారి విజ్ఞానాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ గోవిందు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పుస్తక పఠనం వల్ల జ్ఞానం, విజ్ఞానం పెరగడమే కాకుండా ఆలోచనా శక్తి, భాషా పరిజ్ఞానం, సృజనాత్మకత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ విజ్ఞాన, సాహిత్య, చారిత్రక పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.

గ్రంథాలయంలో అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలకు అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, చిన్నతనం నుంచే పఠన అలవాటును జీవితంలో భాగం చేసుకోవాలని హితవు పలికారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి పుస్తకాలను చదివి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాఘవేందర్ రెడ్డి, పూర్ణచంద్రకళ, తిరుపతమ్మ, రాజు, సాయిశంకర్, గాయత్రి, శ్రీదేవి, జహీరా, శివశంకర్, రమ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
🏠 Home