🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:26 pm Posted by : Praja Nestham Jwala News

ధర్మసాగర్‌లో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

News Image
ధర్మసాగర్, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): భారత తొలి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ వేడుకలను ధర్మసాగర్ మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గంట సాంబరాజు ఆధ్వర్యంలో నెహ్రూ విగ్రహం వద్ద ఈ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, విద్యారంగ ప్రగతికి నెహ్రూ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జన్మదినాన్ని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతూ కార్యక్రమాన్ని సందడిగా జరిపారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలీయా, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరై వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
🏠 Home