🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:24 pm Posted by : Praja Nestham Jwala News

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం

News Image
ఆసిఫాబాద్, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 19 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులుగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సదుపాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత వెల్లడించారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అధికారుల సూచనలు పాటించాలని పేర్కొన్నారు.
🏠 Home