విద్యార్థులు లక్ష్యసాధనతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
భీమదేవరపల్లి, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి బంగారు పునాది వంటిదని, చదువుకునే వయస్సులో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనవసర ఆలోచనలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి ఏకాగ్రత చూపాలని హితవు పలికారు.
ప్రతి విద్యార్థి నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు మంచి నడవడిక, సమయపాలన, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, వేణుగోపాల్, వార్డు సభ్యులు శ్యామ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్లు, లలిత, సంధ్య, సీఏలు రాణి, కవిత, కేవీకే ఫీల్డ్ రెగ్యులేటర్ రజిత తదితరులు పాల్గొన్నారు.