🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 7:04 pm Posted by : A Bharat Goud

పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి దాతల చేయూత

News Image
గోశాల, ఈ-హుండీ, క్యూలైన్లు, జమ్మిచెట్టు వద్ద అరుగు, గార్డెన్ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం

పాలెం, నవంబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు ముందుకొచ్చి తమ వంతు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

భక్తులు ఆన్‌లైన్ ద్వారా మొక్కులు సమర్పించుకునేందుకు వీలుగా ఈ-హుండీని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. శనివారం ఆలయ అభివృద్ధి పనులను జున్న శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ గోకులం గోశాల ఏర్పాటుకు జున్న శేఖర్ రెడ్డి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ల ఏర్పాటుకు అశోక్ రెడ్డి, దసరా పండుగ సందర్భంగా జమ్మిచెట్టు వద్ద అరుగు నిర్మాణానికి సొప్పరి బాలస్వామి ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఆలయ ప్రధాన కమాన్‌కు ఇరువైపులా అందమైన గార్డెన్ల ఏర్పాటు కోసం ఈషా హాస్పిటల్ యాజమాన్యం ఆర్థిక సహకారం అందిస్తోంది.

ఆలయ అభివృద్ధి కోసం దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకారం అందించడం అభినందనీయమని గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దాతల సహకారంతో ఆలయ ప్రాంగణం మరింత సుందరంగా మారడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలందరికీ గ్రామస్తులు, భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జనుంపల్లి జైపాల్ రెడ్డి, జున్న శేఖర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యులు, జయంత్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సురేందర్, వెంకటేష్, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ సిబ్బంది శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home