🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 7:24 pm Posted by : Nagaraju Golla

ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వరంగల్ సీపీ ఎన్. శ్వేత

News Image
రికార్డులు, కేసుల వివరాల పరిశీలన.. పోలీసు సిబ్బందికి పలు సూచనలు

ఐనవోలు, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ శుక్రవారం ఐనవోలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆమెకు పోలీస్ అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ కొబ్బరి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను చాటారు.

రికార్డుల పరిశీలన.. సిబ్బందికి దిశానిర్దేశం
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, రిజిస్టర్లను సీపీ క్షుణ్ణంగా పరిశీలించి వాటి నిర్వహణ తీరును సమీక్షించారు. పోలీసు సిబ్బంది విధులు, బాధ్యతలు, పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందిస్తూ పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆదేశించారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలి
ఐనవోలులోని ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీపీ సూచించారు. భక్తుల మనోభావాలు, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను కాపాడాలని తెలిపారు.

అలాగే పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ సంతోష్, ఐనవోలు ఎస్ఐ అశోక్, సంగెం ఎస్ఐ వంశీకృష్ణ, పర్వతగిరి ఎస్ఐ రాజ్‌కుమార్‌తో పాటు ఐనవోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home