🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 7:05 pm Posted by : Marelli kiran

హనుమకొండలో నేటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

News Image


నూతన ఆడిటోరియం, రీడింగ్ హాల్ ప్రారంభం.. నవంబర్ 20 వరకు వేడుకలు

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్యదర్శి సరిత ఒక ప్రకటనలో తెలిపారు. వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

నూతన వసతులకు ప్రారంభోత్సవం
వారోత్సవాల సందర్భంగా జిల్లా గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, రీడింగ్ హాల్‌ను ప్రారంభించనున్నారు. పాఠకులు, విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ వసతులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులు, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని అజీజ్ ఖాన్, సరిత కోరారు.
🏠 Home