🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 7:03 pm Posted by : Marelli kiran

రెగ్యులరైజేషన్ కోసం కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల చాక్‌డౌన్

News Image


రిజిస్ట్రార్‌కు వినతిపత్రం.. యూజీసీ పే స్కేల్‌తో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ (కేయూ) కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాక్‌డౌన్ నిరసన చేపట్టారు. రెగ్యులర్ నియామకాలు చేపట్టే ముందే తమ సమస్యను పరిష్కరించి, సేవలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

నిరసన అనంతరం కాంట్రాక్ట్ అధ్యాపకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా పే స్కేల్‌తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి న్యాయం చేయకుంటే జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నేతలు హెచ్చరించారు.
🏠 Home