🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:56 pm Posted by : Praja Nestham Jwala News

వజినేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ అంతరాయం

News Image
భూపాలపల్లి రూరల్, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): 33/11 కేవీ వజినేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం (నవంబర్ 14) విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ అంతరాయం వల్ల గొర్లవీడు, వజినేపల్లి, నేరేడుపల్లి గ్రామాలతో పాటు సదరు సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
🏠 Home