🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:56 pm Posted by : Marelli kiran

రైతులకు ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలు.. ‘భారత్ విస్తార్’ సేవలకు తెలంగాణ ఒప్పందం

News Image


హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రంలోని రైతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా తెలుగులోనే సమగ్ర వ్యవసాయ సలహాలు అందించేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (ఎన్‌ఐఎస్‌జీ) మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘భారత్ విస్తార్’ డిజిటల్ వేదిక ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని సులభంగా అందించనున్నారు.

ఈ వేదిక ద్వారా పంటల సాగు విధానాలు, వాతావరణ హెచ్చరికలు, చీడపీడలు, తెగుళ్ల నివారణ చర్యలు, ఎరువుల వినియోగం, మార్కెట్ ధరలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను రైతులు తమకు అర్థమయ్యే తెలుగులో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సేవలను రైతులకు చేరువ చేసేందుకు 155261 హెల్ప్‌లైన్ నంబర్‌తో పాటు వెబ్ పోర్టల్, మొబైల్ యాప్, వాట్సాప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటి ద్వారా రైతులు తమ వ్యవసాయ సమస్యలకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు సకాలంలో సాంకేతిక సమాచారం చేరడంతో పాటు వ్యవసాయ నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడనున్నాయి.
🏠 Home