🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:46 pm Posted by : A Bharat Goud

పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

News Image


నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): పోలీస్ సిబ్బంది ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీస్ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆదేశాల మేరకు శుక్రవారం తుడుకుర్తిలోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఎంటీఓ రాఘవరావు, ఏఎంటీఓ గౌస్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో వైద్య నిపుణులు పోలీస్ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు చేసి, కంటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందించారు. వాహనాలను సురక్షితంగా నడపడానికి స్పష్టమైన కంటిచూపు ఎంతో అవసరమని, డ్రైవర్లు నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లాలోని పోలీస్ వాహనాల డ్రైవర్లందరూ తరచూ ఆరోగ్య, కంటి పరీక్షలు చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
🏠 Home