🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 November 2026, 6:25 pm Posted by : Praja Nestham Jwala News

ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ దుర్మరణం!

News Image


ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న డీసీఎం.. క్యాబిన్‌లోనే చిక్కుకుని డ్రైవర్ మృతి

సూర్యాపేట, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 65పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. డీసీఎం వేగంగా వచ్చి లారీని ఢీకొనడంతో వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో మృతదేహాన్ని బయటకు తీయడం కష్టంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్థులు కూడా పోలీసులతో కలిసి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home