🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 November 2026, 4:47 pm Posted by : Nagaraju Golla

పదో తరగతి ఉత్తమ ఫలితాలే లక్ష్యం.. విద్యార్థులకు డీఈఓ సూచనలు

News Image


పరకాల, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, పరకాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎల్.వి. గిరిరాజ్ గౌడ్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా ప్రగతిని, అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన డీఈఓ.. వార్షిక పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, నిరంతర అధ్యయనం, పునశ్చరణతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న అడాప్షన్ కార్యక్రమం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన ఆయన బోధనా పద్ధతులు, విద్యార్థుల అభ్యసన ప్రగతి, పదో తరగతిలో మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలలో విద్యా కార్యక్రమాల నిర్వహణ, పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పరకాల విద్యాధికారి చిలువేరు సురేందర్, జిల్లాస్థాయి అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 Home