🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 7:27 pm Posted by : Marelli kiran

వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో 10+2 విద్యా విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

News Image


హనుమకొండ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల):

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తరహాలో రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేస్తూ విద్యా విధానాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు.

ప్రతిపాదిత విధానం ప్రకారం నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్య, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్య కొనసాగనుంది. ఈ మార్పుల ద్వారా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు సమగ్ర విద్యను అందించడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో భాగంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై పూర్తి పట్టు సాధించేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించే విధంగా విద్యా విధానాన్ని రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
🏠 Home