మిర్యాలగూడలో సదర్ ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం: గంగుల అంజలి యాదవ్
మిర్యాలగూడ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): మిర్యాలగూడ పట్టణంలో త్వరలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనాన్ని యాదవ సోదరులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గంగుల అంజలి యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని యాదవ సంఘ భవనంలో సదర్ ఉత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగుల అంజలి యాదవ్ మాట్లాడుతూ.. యాదవుల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెప్పే సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. త్వరలో జరగనున్న సదర్ సమ్మేళనానికి యాదవ సోదరులు, సంఘం సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యాదవ వెల్ఫేర్ సంఘం అధ్యక్షుడు చింతలచెరువు లింగయ్య యాదవ్, గౌరవ సలహాదారు గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, చేగొండి మురళీ యాదవ్, సురేష్ యాదవ్, అంజి యాదవ్, బోర మారయ్య యాదవ్, మట్టపల్లి సైదులు యాదవ్, చిమట ఎరయ్య యాదవ్, జవ్వాజి సత్యనారాయణ యాదవ్, చిలకల మురళి, ఉగ్గిది జానయ్య యాదవ్, కేపీ రాజు, జంగిలి గోపాలకృష్ణ, పట్టెం రామచంద్రయ్య యాదవ్, దొండ సురేష్, రాజు, జడ మధు, కుర్ర సాయి, ఊరిబండి శ్రీనివాస్, మండల రామ్మూర్తి, జీడయ్య యాదవ్, కానసాని సోమయ్య, ముక్క వెంకన్న యాదవ్, పేర్ల లింగయ్య, శ్రీనివాస్, కుమార్ తదితర యాదవ సోదరులు పాల్గొన్నారు.