🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 6:46 pm Posted by : Praja Nestham Jwala News

పేద విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజులకు ఎస్‌టీయూ ఆర్థిక సహాయం

News Image


రాయనిగూడెం, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల: ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత అని, ఉపాధ్యాయ సంఘాల కృషితోనే పాఠశాలలకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు బూట్లు, సాక్సులు వంటి సౌకర్యాలు అందుతున్నాయని ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ అన్నారు. బుధవారం రాయనిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్‌టీయూ సంఘం, ప్రాణక్ హీలింగ్ యోగ సంస్థ సంయుక్త సహకారంతో 22 మంది పదో తరగతి విద్యార్థులకు రూ.5,500 పరీక్ష ఫీజును నగదు రూపంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా సదానందం గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, బలహీన వర్గాల విద్యార్థులకు దాతల సహకారంతో 8 పాఠశాలల్లోని 250 మంది విద్యార్థులకు రూ.60 వేల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమానికి కృషి చేసిన ఎస్‌టీయూ నాయకుడు పాలూరు అంజయ్యను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న విద్యావంతులంతా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, పేద విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, పద్మ, ఎస్‌టీయూ నాయకులు కె.వి. సత్యనారాయణ, కె. వీరరాఘవులు, పిట్టల నాగేశ్వరరావు, మీసాల నరసింహారావు, జానకిరెడ్డి, హరిలాల్, శశికళ, విజయనిర్మల, ప్రదీప్, ఉష తదితరులు పాల్గొన్నారు.
🏠 Home