🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 6:45 pm Posted by : Praja Nestham Jwala News

విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన

News Image


పాలెం పాఠశాలలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

బిజినపల్లి, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నిహారిక ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, చట్టాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రభుత్వ న్యాయవాది శ్రీరామ్ ఆర్య సైతం కార్యక్రమంలో పాల్గొని సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ మైనుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
🏠 Home