కాంగ్రెస్ పార్టీ వేలేరు మండల విస్తృతస్థాయి సమావేశం
వేలేరు, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల: కాంగ్రెస్ పార్టీ వేలేరు మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, నూతన గ్రామ కమిటీల పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలేరు మండలంలోని 12 గ్రామాలకు నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షులను సన్మానించి, పార్టీ బాధ్యతలను అప్పగించారు. బండతండ గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిగా మాలోతు శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మాలోతు శ్రీకాంత్ మాట్లాడుతూ తనకు గ్రామ శాఖ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామ్ రెడ్డి, వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురావత్ లక్ష్మణ్ నాయక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సర్పంచ్ మాలోతు అరుణ నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్, మాజీ సర్పంచ్ మల్లికార్జున్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.