రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
భీమదేవరపల్లి, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల:
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర, కొత్తకొండ, మాణిక్యపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను కోరారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పూస కోయిల ప్రకాష్, మొండయ్య, రమేష్, సతీష్, శారద, అశోక్, చింతరాజు, జక్కుల అనిల్, వెంకటేష్, వ్యవసాయ శాఖ ఏఓ, ఏఈఓ, గ్రామ కార్యదర్శి, సీసీ సదానందం, సీఏలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.