🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 6:38 pm Posted by : Praja Nestham Jwala News

తూనికలు, కొలతల్లో అక్రమాలకు తావివ్వొద్దు

News Image


మల్లారం గ్రామంలో దుకాణాలు, వెయిట్‌ బ్రిడ్జిపై అధికారుల తనిఖీలు

భీమదేవరపల్లి, నవంబర్ 11, ప్రజా నేస్తం జ్వాల:

భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామంలోని పలు దుకాణాలను తనిఖీ చేసి, వ్యాపారులు వినియోగిస్తున్న తూనికలు, కొలతల యంత్రాలను పరిశీలించారు.

అనంతరం ముల్కనూరు సహకార సంఘం మల్లారం గోదాములోని వెయిట్‌ బ్రిడ్జిని తనిఖీ చేశారు. వ్యాపారులు ఖచ్చితమైన తూనికలు, కొలతలు పాటించాలని, వినియోగించే యంత్రాలకు తప్పనిసరిగా ధృవీకరణ చేయించుకోవాలని అధికారులు సూచించారు. తూనికలు, కొలతల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
🏠 Home