ఘనంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ 2వ వార్షికోత్సవ వేడుకలు – 30 ప్రధాన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్‌లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జాతీయ స్థాయి ధర్నా నిర్వహణకు నిర్ణయం.
హైదరాబాద్, నవంబర్ 9:
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రెండవ వార్షికోత్సవ వేడుకలను నవంబర్ 9, 2026న హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ హాజరయ్యారు.
జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి దేశాల భూపాల్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకతను తెలుసుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిందని, ప్రతి పౌరుడు ఈ చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలుకు ప్రజల్లో చైతన్యం అవసరమని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంస్థలు చేపట్టే కార్యక్రమాలు ప్రాధాన్యత కలిగి ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా సంస్థ చేపట్టిన ప్రజా చైతన్య కార్యక్రమాలు, సమాచార హక్కు చట్టం-2005 అమలు, అవినీతి నిర్మూలన, ప్రభుత్వ పాలనలో పారదర్శకత వంటి అంశాలపై చర్చించారు.
అదేవిధంగా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లెకో ప్రతినిధి – ప్రతి గ్రామానికి ఒక ప్రతినిధి” కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేసి, ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
సమాచార హక్కు చట్టం అమలులో ఉన్న సమస్యల పరిష్కారం, దేశవ్యాప్తంగా మానిటరింగ్ మెంబర్స్ వ్యవస్థ ఏర్పాటు, సమాచార హక్కు కార్యకర్తలకు రక్షణ, సమాచార కమిషన్ల బలోపేతం తదితర అంశాలతో పాటు మొత్తం 30 ప్రధాన డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ నెలలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో “చలో ఢిల్లీ” జాతీయ స్థాయి ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆర్టీఐ కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, సంస్థ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సంస్థను జాతీయ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు బలోపేతం చేస్తూ ప్రజా హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన కోసం నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు గోపీనాథన్ కట్టెకోలా,జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి,రాష్ట్ర ఉపాధ్యక్షులు అరవింద స్వామి,కె.సాయిరాం, రాష్ట్ర కార్యదర్శులు రావుల నవీన్ కుమార్,లక్ష్మి అన్నపూర్ణ,రజని, శరత్ కుమార్,నాగ జ్యోతి,రేణు కుమార్,క్రాంతి కుమార్,రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఎ.శ్రీకాంత్ రెడ్డి, హెచ్.అశోక్ కుమార్,బాపయ్య, సాయి బాబు,సుధీర్,సంజీవ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.