ఘనంగా సమాచార హక్కు సాధన కమిటీ 2వ ఆవిర్భావ దినోత్సవం
ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం, అవినీతి రహిత పాలనకు బాటలు వేయడమే లక్ష్యంగా సమాచార హక్కు సాధన కమిటీ పని చేస్తోందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు తోట సురేష్ పేర్కొన్నారు. సమాచార హక్కు సాధన కమిటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోట సురేష్ మాట్లాడుతూ, సామాన్య పౌరునికి రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధం సమాచార హక్కు చట్టం (RTI) అని తెలిపారు. పాలనలో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో కమిటీ అలుపెరగని పోరాటం చేస్తోందని వివరించారు. సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ దిశానిర్దేశంలో దేశవ్యాప్తంగా పౌర హక్కుల రక్షణ కోసం విశేష కృషి జరుగుతోందని కొనియాడారు. అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి సూర స్రవంతి నాయకత్వంలో తెలంగాణవ్యాప్తంగా కమిటీ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజలో ఉన్నాయని చెప్పారు.
కమిటీలో నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి కార్యకర్త, బాధ్యుడు సంస్థకు నిజమైన బలమని, ప్రజలకు చట్టాలపై చైతన్యం కల్పిస్తూ అన్యాయాలను ఎదిరించడంలో సభ్యుల పాత్ర ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా జిల్లాలోని అన్ని విభాగాల్లో సమస్యల పరిష్కారానికి సమాచార హక్కు సాధన కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కమిటీ ముఖ్య ప్రతినిధులు, సభ్యులు పాల్గొని 2వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.