పేదల సొంతింట కలకు సాకారం.. ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి వెలుగులు..
ముఖ్యమైన పాయింట్స్:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించడమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం – మంత్రి పొన్నం ప్రభాకర్...మొదటి దశలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి..
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు చిదురాల రమ నూతన గృహంలో నిర్వహించిన తొలి దీపావళి వేడుకల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమ దంపతులకు నూతన వస్త్రాలు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి టపాసులు కాల్చి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద కుటుంబాలు తమ సొంత ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం తొలి విడతలో సుమారు రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి వివిధ కేటగిరీల్లో ఇళ్లను కేటాయిస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబం జీవితకాల స్వప్నమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉప సర్పంచ్ మమతా బాలకృష్ణ, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు..