చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి
*దీపాల కాంతులవలె ప్రతి ఇంటా వెలుగులు నిండాలి*
*బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి*
సూర్యాపేట (ప్రజానేస్తం జ్వాల):
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని, దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా సంతోషం, సౌభాగ్యం వెల్లివిరియాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
నరకాసుర వధకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజల జీవితాల్లోని చీకట్లను తొలగించి వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని పేర్కొన్నారు. దీపాల వెలుగులు అజ్ఞానాంధకారాన్ని తొలగించి, ప్రజల్లో చైతన్యాన్ని నింపాలని అన్నారు.
దీపావళి వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు తావులేకుండా పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. కార్తీక మాసంలో నిర్వహించే పూజలు ప్రజలందరికీ శుభఫలితాలను అందించాలని ఆకాంక్షిస్తూ మరోసారి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.