ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో స్వర్ణం
400 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం.. జాతీయ పోటీలకు తెలంగాణ తరఫున ఎంపిక
హనుమకొండ:
ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సీఈసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి గంగారపు ప్రభుదేవ్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. ఖమ్మంలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) రాష్ట్రస్థాయి పోటీల్లో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఈ విజయంతో నవంబర్ 11 నుంచి మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎస్‌జీఎఫ్‌ఐ జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. 400 మీటర్ల పరుగు పందెంతో పాటు 400 మీటర్ల రిలే విభాగంలోనూ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ప్రభుదేవ్ సాధించిన విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి కళాశాలకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసంతో పాటు వ్యక్తిత్వ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపే విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి రంగాల్లో ప్రత్యేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు. చదువుతోపాటు క్రీడలపైనా విద్యార్థులు శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుదేవ్ తండ్రి గంగారపు శ్రీనివాస్, అధ్యాపకులు ప్రభాకర్, వెంకట్, గణేష్, సదానందం, రవళి, వేణు, చంద్రమౌళి తదితరులు పాల్గొని విద్యార్థిని అభినందించారు.