షార్ట్ సర్క్యూట్‌తో టాటా ఏస్ వాహనం దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఆసిఫాబాద్, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని 363వ జాతీయ రహదారిపై శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బూరుగుడా బీఈడీ కళాశాల సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా టాటా ఏస్ ప్యాసింజర్ వాహనం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది.
TS 1 EB 6667 రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ వాహనం పర్సనాంబల గెడేకర్ రవీందర్‌కు చెందినది. వాహనం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు సమాచారం. క్షణాల్లోనే మంటలు వాహనం అంతటా వ్యాపించడంతో వాహనంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అయితే వాహనంలో మంటలు చెలరేగడాన్ని ముందుగానే గుర్తించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందకు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటల తీవ్రతకు వాహనం పూర్తిగా కాలిపోయి తీవ్ర ఆస్తినష్టం సంభవించింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనతో కొద్దిసేపు స్థానికంగా ఆందోళన నెలకొంది.