కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో టాలెంట్ టెస్ట్.. టాప్-10 విద్యార్థులకు బహుమతులు
కొంపల్లి, నవంబర్ 06 (ప్రజానేస్తం జ్వాల): కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు HELP TO NEEDY GROUP ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, చదువుపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పరీక్షను నిర్వహించారు.
పరీక్షలో 60 శాతానికి పైగా మార్కులు సాధించి టాప్-10 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ALL IN ONE పుస్తకాలను బహుమతులుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దాత పిన్నింటి మాధవరావు (JPA, KTPP) పుస్తకాలను అందించడంతో పాటు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థి ఉన్నత విద్యకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొంగ సోమేశ్వర్ (AE, KTPP), కొంపల్లి గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అనంతరం ముఖ్య అతిథులు విద్యార్థులకు విలువైన సూచనలు చేస్తూ, క్రమశిక్షణతో చదివి ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, పేద విద్యార్థులకు అండగా నిలవడం ద్వారా వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని HELP TO NEEDY GROUP ప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమ విజయానికి సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ముఖ్య అతిథులు, ప్రశ్నాపత్రాల రూపకల్పనలో, పరీక్ష నిర్వహణలో భాగస్వాములైన వారితో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ HELP TO NEEDY GROUP తరపున కృతజ్ఞతలు తెలిపారు.