🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:32 pm Posted by : Praja Nestham Jwala News

ముల్కనూర్‌లో నేడే సదర్ మహోత్సవం

News Image


ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో తొలిసారిగా సదర్ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు భీమదేవరపల్లి శ్రీకృష్ణ యాదవ నాయకులు జక్కుల అనిల్ యాదవ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవుల సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలిచే సదర్ మహోత్సవాన్ని ముల్కనూర్‌లో నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు.

సదర్ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, యాదవ సంఘాల నాయకులు, కుల పెద్దలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జక్కుల అనిల్ యాదవ్ పిలుపునిచ్చారు.
🏠 Home