పేద విద్యార్థుల చదువుకు బండి సంజయ్ ఆర్థిక భరోసా
భీమదేవరపల్లి, నవంబర్ 06 (ప్రజానేస్తం జ్వాల):
ఆర్థిక ఇబ్బందులతో పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించారు. హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 463 మంది విద్యార్థుల పరీక్ష ఫీజుల కోసం మొత్తం రూ.57,875ను స్వయంగా చెల్లించారు.
ఈ వివరాలను బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కోలను సంతోష్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రవికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో బండి సంజయ్ అందించిన సహకారంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి సర్పంచ్, సిద్ధిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు మాచర్ల కుమారస్వామి, భీమదేవరపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీరామోజు శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రుత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.