🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:29 pm Posted by : Marelli kiran

స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

News Image


హనుమకొండ, నవంబర్‌ 06 (ప్రజానేస్తం జ్వాల): స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ సాగిస్తూ, పిల్లల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అనిల్ చందర్, డాక్టర్ అనితా రెడ్డి సూచించారు.

హనుమకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి చిన్నారికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, వైద్య చరిత్రకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అలాగే సంస్థకు సంబంధించిన లైసెన్సులను గడువులోగా రెన్యూవల్ చేయించుకోవాలని ఆదేశించారు.

అనంతరం ఆశ్రమంలో పిల్లలకు అందిస్తున్న సేవలు, వసతులు, సౌకర్యాలను వారు పరిశీలించారు.
🏠 Home