బాలికపై లైంగిక దాడి కేసులో దోషి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
హనుమకొండ, నవంబర్ 06 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ జిల్లాలో గిరిజన బాలికపై సామూహిక లైంగిక దాడికి సంబంధించిన కేసులో ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. శిక్షను సవాలు చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
వివరాల ప్రకారం.. 2015 మార్చి 16న వరంగల్ జిల్లాలోని ఓ తండాలో ఒంటరిగా ఉన్న గిరిజన బాలికపై పలువురు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అనంతరం ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ట్రయల్ కోర్టు విధించిన శిక్ష సమర్థించబడింది.
దీంతో నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లి సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన అనంతరం నిందితుడి పిటిషన్‌ను తిరస్కరిస్తూ, కింది కోర్టులు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.
దీంతో ఈ కేసులో నిందితుడికి విధించిన శిక్షపై న్యాయపరమైన సవాలు ముగిసింది.