🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:27 pm Posted by : Marelli kiran

*పోక్సో కేసులో నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష*

News Image


హనుమకొండ, నవంబర్‌ 06 (ప్రజానేస్తం జ్వాల): మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి వరంగల్ ప్రత్యేక సెషన్స్ కోర్టు 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

వివరాల ప్రకారం.. సంతగల్లు నాయుడు అలియాస్ సిద్ధార్థ్ (21) అనే యువకుడిపై 2023లో నెక్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన వరంగల్ ప్రత్యేక సెషన్స్ జడ్జి నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.

మైనర్ బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.
🏠 Home