🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 2:40 pm Posted by : Praja Nestham Jwala News

ఈవీఎం గోదాంలో భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ హరిత క్షేత్రస్థాయి తనిఖీ

News Image


ఆసిఫాబాద్, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల): ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గోదాం వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత తెలిపారు. ఈవీఎంల భద్రత విషయంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని, నిబంధనల ప్రకారం అన్ని భద్రతా చర్యలు అమలులో ఉండాలని పేర్కొన్నారు.

శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును నెలవారీ తనిఖీల్లో భాగంగా కలెక్టర్ హరిత సందర్శించారు. ఈ సందర్భంగా గోదాం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన సీలింగ్ వ్యవస్థను పరిశీలించారు. గోదాం పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థను తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్ల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు.

ఈవీఎం గోదాం వద్ద భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. గోదాం ప్రవేశ ద్వారాల సీలింగ్, భద్రతా పర్యవేక్షణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత కీలకమైన అంశమని, వాటి పరిరక్షణకు సంబంధిత అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈవీఎం గోదాముకు సంబంధించిన భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిర్దేశిత మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
🏠 Home