🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 10:45 am Posted by : Praja Nestham Jwala News

వరంగల్‌లో కల్తీ కారం, పసుపు పొడి గుట్టురట్టు.. 2,250 కిలోలు స్వాధీనం!

News Image



వరంగల్, నవంబర్‌ 6 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రట్టు చేశారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంయుక్తంగా దాడులు నిర్వహించి భారీగా కల్తీ కారం, పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2,250 కిలోల కల్తీ కారం, పసుపు పొడిని పట్టుకోగా, వాటి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. ఎలాంటి లైసెన్స్, లేబుల్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో పొడులను ప్యాకింగ్ చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయాలపై అధికారులు చర్యలు చేపట్టారు.
🏠 Home