ముల్కనూర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భీమదేవరపల్లి, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వంగర ఎస్సై ఎం. రాజు తెలిపారు.
ఎస్సై వివరాల ప్రకారం.. ముల్కనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం. రాజు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.