కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్ శేషాద్రి
భీమదేవరపల్లి, నవంబర్ 5 (ప్రజానేస్తం జ్వాల):
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్, జెడ్పీ సీఈవో శేషాద్రి గురువారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆలయానికి చేరుకున్న అడిషనల్ కలెక్టర్కు ఆలయ అధికారులు, సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గిర్రాజ్ గౌడ్, మండల విద్యాశాఖ అధికారి భూక్య శంకర్, ఎంపీడీవో వీరేశం, పలువురు మండల అధికారులు పాల్గొన్నారు.