🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:46 pm Posted by : Marelli kiran

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల: దరఖాస్తులకు డిసెంబర్ 2 తుది గడువు!

News Image
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE) నోటిఫికేషన్ అధికారికంగా విడుదలైంది. 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు విద్యార్థులు డిసెంబర్ 2 వరకు అధికారిక పోర్టల్ (exams.nta.nic.in/sainik-school-society/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకునే వీలుండగా, డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఎడిట్ ఆప్షన్ కల్పించారు. జనవరి 25 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి రానుండగా, జనవరి 31న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
🏠 Home