🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:45 pm Posted by : Marelli kiran

ఓజోన్ క్రిమిసంహారక సాంకేతికత వాణిజ్యీకరణకు ఎన్ఐటీ వరంగల్ కీలక ఒప్పందం!

News Image
ఎన్ఐటీ వరంగల్ భౌతిక శాస్త్ర విభాగం అభివృద్ధి చేసిన వినూత్న ఓజోన్ ఆధారిత క్రిమిసంహారక సాంకేతికత వాణిజ్యీకరణ కోసం మోహ్‌సాఫ్ట్ టెక్ (MOHSoft Tech) సంస్థతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. నిర్దిష్ట పరిస్థితుల్లో 99.9 శాతం వరకు వైరస్‌లు, బ్యాక్టీరియాను సంహరించే ఈ అత్యాధునిక పరిజ్ఞానంతో ఆసుపత్రులు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన శుద్ధి పరికరాలను తయారు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి తొలి విడత ఉత్పత్తులను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
🏠 Home