నిరుద్యోగ యువతకు ఈ నెల 7న ఉచిత నైపుణ్య శిక్షణ: జిల్లా ఉపాధి కల్పనాధికారిణి శ్యామల వెల్లడి!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగ యువతకు ఈ నెల 7వ తేదీన ఉచిత నైపుణ్య శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి శ్యామల తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలు కలిగిన యువతీయువకులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఉదయం 10 గంటలకు ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతుందని వివరించారు.