చారిత్రక పద్మాక్షి దేవాలయంలో ఘనంగా వరుణసహిత రుద్రయాగం!
దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, కరువు ఉపద్రవాల నుంచి విముక్తి కలగాలని ఆకాంక్షిస్తూ చారిత్రక పద్మాక్షి దేవాలయంలో వరుణసహిత రుద్రయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పది మంది వేద పండితుల ఆధ్వర్యంలో నక్షత్రపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం శాస్త్రోక్తంగా చేపట్టారు. షణ్ముఖి పద్మనాభ అవధాని, నాగిళ్ల శంకర్ శర్మ ఆచార్యత్వంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.