🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:10 pm Posted by : Nagilla Rajinikanth

మల్లారంలో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

News Image


అధ్యక్షుడిగా నోముల రమేష్, ఉపాధ్యక్షులుగా యాట రమేష్, శ్రీకాంత్

భీమదేవరపల్లి, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో గ్రామ శాఖ అధ్యక్షుడిగా నోముల రమేష్ ఎంపికయ్యారు.

ఉపాధ్యక్షులుగా యాట రమేష్, శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల తిరుపతి, కోఆర్డినేటర్‌గా ఇట్టబోయిన తిరుపతిని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. ఎన్నికల కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home