🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 6:04 pm Posted by : Nagilla Rajinikanth

2,557 మంది విద్యార్థులకు అల్పాహారం.. ప్రభుత్వ పాఠశాలల్లో పథకం ప్రారంభం

News Image


విద్యార్థుల ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యం పెంపే లక్ష్యం

భీమదేవరపల్లి, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకం భీమదేవరపల్లి మండలంలో గురువారం ప్రారంభమైంది. కొత్తకొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో అడిషనల్ కలెక్టర్ శేషాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ బి. శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,557 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రతిరోజూ అల్పాహారం అందించనున్నట్లు తెలిపారు. పౌష్టికాహారం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు పాఠశాలల హాజరు, చదువుపై ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం పెరుగుతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఇన్‌చార్జి ఎంఈఓ భూక్యా శంకర్, ఎంపీడీవో వీరేశం, ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🏠 Home