🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 12:01 pm Posted by : Marelli kiran

బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు: ఉత్తర్వులు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్!

News Image
రాష్ట్రంలోని 37 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికారిక జీవో ప్రతులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుల సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగానే ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భవనాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
🏠 Home