🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 November 2026, 7:50 am Posted by : Marelli kiran

ఇకపై డోర్లు క్లోజ్ చేశాకే బస్సులు కదలాలి: TGSRTC కీలక ఆదేశాలు!

News Image
హనుమకొండ, 05 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఆధ్వర్యంలో నడిచే అన్ని రకాల బస్సులకు తప్పనిసరిగా డోర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బస్సు తలుపులు పూర్తిగా మూసిన తర్వాతే వాహనాన్ని ముందుకు కదల్చాలని స్పష్టం చేసింది. డోర్లు లేని బస్సులను తక్షణమే గుర్తించి కొత్తవి అమర్చాలని అధికారులకు సూచించింది. ఇటీవల మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ బస్సు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందిన ఘటన నేపథ్యంలో యాజమాన్యం ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
🏠 Home