వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యురాలు, మైనార్టీ నాయకురాలు షేక్ రసూల్ ఫాతిమా కుమారుడు నాగుల మీరా వివాహం సందర్భంగా నిర్వహించిన కందూరు వేడుకల్లో మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అర్వపల్లి గణేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సీత శ్రీనివాస్ యాదవ్, గుడిపూడి వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు ఏలూరి కృష్ణ, అన్నం అశోక్, కాంగ్రెస్ నాయకులు ఆలకుంట ముత్తయ్య, నాయిని సతీష్, అంబాల వెంకన్న, నాయిని పురుషోత్తం, గంజి సురేష్, నాయిని ఉపేందర్, షేక్ రహమత్, బెనర్జీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.