గీసుగొండ మండల కాంగ్రెస్ కమిటీల ప్రకటన
గీసుగొండ, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ సంస్థాగత ఎన్నికలు–2026లో భాగంగా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిటీని ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్, మండల అధ్యక్షుడు దాడి శివ సంయుక్తంగా మండల, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్ కమిటీల వివరాలను వెల్లడించారు.
మండల కాంగ్రెస్ కమిటీ: అధ్యక్షుడిగా దాడి శివ, ఉపాధ్యక్షులుగా జన్ను రమేష్, బాదావత్ రమేష్, నల్ల సురేష్, ప్రధాన కార్యదర్శులుగా నకినబోయిన నాగరాజు, కొమ్ము శ్రీకాంత్, చల్లా కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా మారడోజు వేణు, కందారి సంతోష్, జల్లెల రవి, తుమ్మనపల్లి బాబురావు, కందికొండ రాజు, జూల రమేష్ నియమితులయ్యారు. కోశాధికారిగా కొల సునీల్, కార్యవర్గ సభ్యులుగా కౌడగాని సతీష్, ఎండీ హుస్సేన్, ఆగుల రాజు, సహింపు వెంకటేశ్వర్లు, భూక్య రాంబాబు, మర్రి రాజలింగం, గడ్డమీది రమేష్‌లను ఎంపిక చేశారు.
మహిళా కాంగ్రెస్ కమిటీ: అధ్యక్షురాలిగా మాదాసి కళ్యాణి, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి సునీత, తుమ్మ నిర్మల జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము సబిత, కార్యదర్శులుగా చిలంకురి లిల్లీ మేరీ, ఊరుగొండ అనిత, కోశాధికారిగా చేతరాశి అన్నపూర్ణ, కార్యవర్గ సభ్యులుగా మంద మల్లికాంబ, కొంగర అంబిక, పులిచేరి మంజులను నియమించారు.
ఎస్సీ సెల్ కమిటీ: అధ్యక్షుడిగా కొమ్ముల వినయ్, ఉపాధ్యక్షులుగా కాయిత అఖిల్, కోట ప్రణయ్, ప్రధాన కార్యదర్శిగా మంద రాజు, కార్యదర్శులుగా డక్క కుమారస్వామి, కొంగర సారిబాబు, కోశాధికారిగా కొరవి రమేష్, కార్యవర్గ సభ్యులుగా జన్ను ప్రశాంత్, కుక్కముడి రాజేష్, నమిండ్ల కుమారస్వామి, పసునూటి శ్యాంసుందర్, వనపాకల సాంబయ్య, చిరుపూరి కోటి, గుండా లక్ష్మణ్, మంద సారంగంలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దాడి శివ మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు పార్టీ సంస్థాగత కార్యకలాపాలను గ్రామస్థాయికి విస్తరించేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.