మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరం
•నేరేడుచర్ల రామ్‌నగర్‌లో 24 మంది మహిళలకు వైద్య పరీక్షలు
నేరేడుచర్ల, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఎస్‌బీఐ ఫౌండేషన్ సౌజన్యంతో, లైఫ్ సీబీఓ సహకారంతో నేరేడుచర్ల పట్టణంలోని రామ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో మొత్తం 24 మంది మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వైద్య సలహాలు అందించారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందవచ్చని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కౌన్సిలర్ ఎంజమూరి వెంకటమ్మ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం మహిత సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆమె అభినందించారు. మహిళలకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, జిల్లా కోఆర్డినేటర్ సయ్యద్ సజ్జాద్ అలీ, వైద్య సిబ్బంది, స్థానిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.