🏠 prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 November 2026, 6:45 pm Posted by : Praja Nestham Jwala News

హుజూర్‌నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లోపాలు వెంటనే సరిచేయాలి

News Image


సూర్యాపేట, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల):

హుజూర్‌నగర్ రామస్వామిగుట్ట వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో గుర్తించిన లోపాలను వెంటనే సరిచేసి, మిగిలిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం ఎస్పీ కే. నరసింహతో కలిసి మోడల్ కాలనీలోని ప్రతి బ్లాక్‌ను పరిశీలించారు. ఇళ్లలోని లోపాలను సరిచేయడంతో పాటు డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
🏠 Home