ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్వీ ఫిర్యాదు
నారాయణపురం, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల):
మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం మండలంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
కొంతమంది అర్హత లేనివారు నకిలీ పత్రాలు, తప్పుడు సమాచారంతో ఓటరు నమోదుకు దరఖాస్తు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. సరైన విచారణ, పత్రాల ధృవీకరణ లేకుండానే దరఖాస్తులు ఆమోదిస్తున్నారనే ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో బీఎల్ఓల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హత లేని దరఖాస్తులను తిరస్కరించాలని కోరారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారికే ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని నలపరాజు రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు అడేపు సురేష్ కుమార్, తిరుమలేష్, గంగాదేవి స్వామి, గవ్వల సందీప్ తదితరులు పాల్గొన్నారు